
ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది `రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు` సాంగ్. బాలకృష్ణ, రజిని జంటగా నటించిన `సీతారాముల కళ్యాణం`(1989) సినిమా లోనిదీ పాట. కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించగా.. ఆచార్య ఆత్రేయ గారు సాహిత్యాన్ని అందించారు. ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల ఆలపించిన ఈ సాంగ్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
ఆ తర్వాత `మంగమ్మగారి మనవడు` (1984) సినిమాలోని `దంచవే మేనత్త కూతురా` సాంగ్ మ్యూజిక్ లవర్స్ కు మోస్ట్ ఫేవరెట్‌గా చెప్పుకోవాలి. ఈ పాటలో బాలయ్య, సుహాసినిల డాన్స్, కెమిస్ట్రీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.
బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన `జానవులే.. నెర జానవులే` పాట టాప్ 3 స్థానాన్ని సొంతం చేసుకుంది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మూవీ `ఆదిత్య 369` చిత్రంలోని స్పెషల్ సాంగ్ ఇది. ఐటెం సాంగ్స్ కు కొత్త అర్థం చెప్పిన ఆ పాటను సిల్క్ స్మిత చేయడం మరొక విశేషం.
`సుల్తాన్`(1999) సినిమాలోని `ఓ కలికి రామ చిలకా` పాట బాలయ్య హిట్ లిస్ట్‌లో టాప్ 4గా నిలిచింది. అప్పట్లో ఈ పాట సినీ, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.
ఆ నెక్స్ట్ `పైసా వసూల్`(2017) చిత్రంలో బాలయ్య ఆలపించిన `మామా ఏక్ పెగ్ లా` సాంగ్ ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ పబ్స్, పార్టీలు, ఫంక్షన్స్‌లో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, సౌందర్య జంటగా నటించిన `టాప్ హీరో`(1994) చిత్రంలో `సామజవరగమన` పాట అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. మాస్ ట్యూన్‌తో సాగే ఈ క్లాస్ సాంగ్ బాలయ్య హిట్ లిస్ట్ లో టాప్ 6గా ఉంది.
బాలకృష్ణ రీసెంట్ ఫిల్మ్ `డాకు మహారాజ్` చిత్రంలోని `దబిడి దిబిడి` పాట టాప్ 7, `సింహా`(2010) చిత్రంలోని `బంగారు కొండ` పాట టాప్ 8, `గాండీవం`(1994) సినిమాలోని `గోరువంక వాలగానే గోపురానికి` టాప్ 9 మరియు సమరసింహా రెడ్డి(1999) మూవీలోని `చలిచలిగా ఉందన్నాడే చలాకీ కుర్రోడు` టాప్ 10లో నిలిచాయి. ఇప్పటికీ ఈ పాటలు చాలా మందికి మోస్ట్ ఫేవరెట్. సో.. మ్యూజిక్ లవర్స్ ఈ సాంగ్స్ వినడం అస్సలు మిస్ అవ్వకండి.