సినిమా ఇండస్ట్రీ లో కొ న్ని సందర్భా ల లో ఒకరు రిజెక్ట్ చేసిన పాత్రలో మరొకరు నటించడం అనేది చా లా సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అయినటువంటి మృనాల్ ఠాకూర్ తన కెరియర్ ప్రారంభం లోనే ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి సల్మాన్ ఖాన్ సినిమాలో ఆ హీరోయిన్ అవకాశాన్ని రిజెక్ట్ చేసిందట. మరి ఇంతకు మృణాల్ ఠాకూర్ రిజెక్ట్ చేసిన ఆ సినిమా ఏది ..? మృణాల్ ఠాగూర్ రిజక్ట్ చేసిన పాత్రలో ఎవరు నటించారు అనే వివరాలను తెలుసుకుందాం.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం సుల్తాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క శర్మ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ 2016 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమాకు అద్భుతమైన టాక్ ప్రేక్షకుల నుండి రావడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ లో మొదట సల్మాన్ ఖాన్ కి జోడిగా అనుష్క శర్మ ను కాకుండా మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ పత్రిక అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈమె ఆ సినిమాలో ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. దానితో అనుష్క శర్మ ను ఈ మూవీ లో హీరోయిన్గా సంప్రదించగా ఆమె ఆ సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలా మృణాల్ ఠాకూర్ "సుల్తాన్" సినిమాలో సల్మాన్ ఖాన్ కి జోడిగా నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: