ఏదైనా సినిమా విడుదలకు ముందు ఆ సినిమాకు సంబంధించి టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయి. అయితే స్టార్ హీరోల సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ అనేది కొద్ది రోజుల ముందు నుండే స్టార్ట్ అవుతుంది. కానీ తాజాగా కుబేర మూవీకి మాత్రం తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్ విషయంలో గట్టి షాక్ తగిలింది.. ఈ విషయంలో ధనుష్ అభిమానులైతే చిత్ర యూనిట్ పై గుర్రుగా ఉన్నారు.మరి ఇంతకీ తమిళనాడులో కుబేర మూవీ కి సంబంధించి వినిపిస్తున్న ఈ విషయంలో ఉన్న నిజమెంత.. నిజంగానే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కాలేదా.. అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. కుబేర మూవీ విడుదలకు కొద్ది రోజులు ఉంది అన్నప్పటినుండే ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

అయితే ఈ ప్రమోషన్స్ తో పాటు పాటలు విడుదల చేయడంలో కూడా చాలానే లోపాలు తలెత్తాయి.ముఖ్యంగా ఇందులో నటించిన ఆర్టిస్టులతో సరైన ప్రమోషన్స్ కూడా చేయించలేకపోయారు. అయితే ఇన్ని లోపాల మధ్యలో సినిమా విడుదలైంది.కానీ సినిమా విడుదలకు ముందు అభిమానులు సినిమా చూడడానికి అడ్వాన్స్ టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు.కానీ తమిళనాడులో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా పూర్తిగా స్టార్ట్ కాకపోవడం ధనుష్ అభిమానుల్లో కోపాన్ని తెప్పించింది. ధనుష్ కి తమిళనాడులో ఎలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అలాంటి కోలీవుడ్ హీరో ధనుష్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ కాకపోవడంతో చాలామంది ధనుష్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అయితే అక్కడక్కడ ఓపెన్ అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో చాలామంది నిరాశలో ఉన్నారు. కోలీవుడ్ హీరో అయినటువంటి ధనుష్ కి ఆ కోలీవుడ్ లోనే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా పూర్తిస్థాయిలో ఓపెన్ కాకపోవడం చిత్ యూనిట్ చేసిన ఎంత పెద్ద లోపమో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఈ ఇష్యూ తెగ వైరల్ అవుతుంది.

 అంతే కాదు ధనుష్ అభిమానులు పూర్తిస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా అందుబాటులోకి తీసుకు రాకపోవడంతో చాలామంది ఫైర్ అవుతున్నారు. ఇందుకుతోడు ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేసిన సునీల్ నారంగ్ కి సినిమా చూపించకపోవడంతో సినిమా యూనిట్ పై కాస్త కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏ సినిమాకైనా సరే సెన్సార్ పూర్తయ్యాక అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయి. కానీ కుబేర సినిమా విషయంలో కాస్త ఆలస్యం అవ్వడంతో తమిళనాడులో కుబేర మూవీకి గట్టి షాక్ తగిలింది అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: