బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన కరిష్మా కపూర్ తన మాజీ భర్త సంజయ్ కపూర్ గడిచిన కొద్ది రోజుల క్రితం అకస్మీక మరణం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. లండన్ లో నివాసం ఉంటున్న సంజయ్ కపూర్ ఎక్కువగా పోలో గేమ్ పడుతూ ఉండేవారట. అయితే అలాంటి సమయంలో అనుకోకుండా ఒక తేనెటీగ తాను మింగడంతో అది లోపల శ్వాస నాళాల మీద కుట్టడంతో అలర్జీ కారణంగా గుండెపోటు వచ్చి మరణించారు. జూన్ 12న సంజయ్ కుమార్ మరణించిన వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.


ఈ వార్త అటు సంజయ్ కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా కలచివేసింది.. అయితే సంజయ్ కుమార్ మరణించి  ఏడు రోజుల తర్వాత  అంత్యక్రియలను నిర్వహించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.దీంతో సోషల్ మీడియాలో పలు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. సంజయ్ కుమార్ అమెరికన్ పౌరసత్వం కలిగి ఉండడం చేత చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటారని దీని కారణంగానే ఆయన మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడంలో కొంతమేరకు ఆలస్యం అయ్యిందని కుటుంబ సభ్యులు తెలిపారు


అందుకే జూన్ 19న న్యూఢిల్లీలో  నిన్నటి రోజున సంజయ్ కపూర్ అంతక్రియలు పూర్తి అయ్యాయి. సంజయ్ కుమార్ లండన్ లో మరణించడంతో అమెరికా పౌరసత్వానికి సంబంధించి కొన్ని చట్టమైన లాంచనాల కారణాం చేత ఇండియాకి మృతదేహాన్ని తీసుకువచ్చే ప్రక్రియలో ఆలస్యం అయ్యిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అందుకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేయడం జరిగింది.జూన్ 22న  సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో తాజ్ ప్యాలెస్ లో ప్రార్థన సమావే చేయబోతున్నామని ఈ కార్యక్రమానికి సంజయ్ తల్లి , భార్య పిల్లలతో సహా  హాజరు కాబోతున్నట్లు పేర్లతో సహా తెలియజేశారు. అయితే సంజయ్ కపూర్ మాజీ భార్య కరిష్మా కపూర్ పిల్లల పేర్లు కూడా ఇందులో ఉండడం గమనార్హం. అందుకే సంజయ్ కపూర్ అంతక్రియలు ఆలస్యమయ్యాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: