
శేఖర్ కమ్ముల లాంటి సాఫ్ట్ డైరెక్టర్ ఇలాంటి ఒక సినిమాను తెరకెక్కిస్తారు అని జనాలు ఊహించలేకపోయారు. సినిమా చాలా చాలా బాగుంది . ఎంతలా అంటే కుబేర సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ధనుష్ - శేఖర్ కమ్ములను ఓ రేంజ్ లో ప్రశంసించేస్తున్నారు . అయితే ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ నెక్స్ట్ ఏ హీరోతో సినిమాకి కమిట్ అయ్యాడు ..? ఎలాంటి సినిమా తెరకెక్కించబోతున్నాడు..? అనేది బిగ్ ఇంట్రెస్టింగ్గా మారింది .
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమాని హీరో నాని తో తెరకెక్కించబోతున్నారట. ఆల్రెడీ దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పనులు కూడా పూర్తి అయిపోయాయట. ఇది ఒక పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా తెరకెక్కబోతుందట. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే శేఖర్ కమ్ముల ఎలా తెరకెక్కిస్తాడో మనకు తెలిసిందే. కచ్చితంగా అది కూల్ అండ్ క్లాసిక్ హిట్టుగా చరిత్ర క్రియేట్ చేస్తుంది. ఈ కాంబో కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిటింగ్ . ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో శేఖర్ కమ్ముల-నాని పేర్లు మారుమ్రోగిపోతున్నాయ్..!