మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప మూవీకి సంబంధించి రీసెంట్ గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధంగా ఉండటంతో అన్ని పనులు పూర్తి చేసి సినిమా రిలీజ్ కి సిద్ధమైపోయారు. అయితే తాజాగా కన్నప్ప మూవీ నటుడు మంచు మోహన్ బాబు గురించి ఒక సంచలన విషయం బయటపడింది.అది కూడా మోహన్ బాబు రివీల్ చేసిన మ్యాటర్.ఇక విషయంలోకి వెళ్తే.. మంచు మోహన్ బాబు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ప్రభుదేవా, విష్ణు వంటి వాళ్లు ఉన్నారు. అయితే కన్నప్ప మూవీ షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్ లో జరిగిన సంఘటనకు తెలిసిందే. 

అయితే తాజాగా కన్నప్ప మూవీ షూటింగ్ జరగడానికి న్యూజిలాండ్ లోని కొన్ని ప్లేసులను చూపిస్తూ ఇదంతా మాదే..నేనే ఇది కొనుగోలు చేశాను. దాదాపు 7 ఎకరాలు న్యూజిలాండ్ లో కొన్నాను అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అయితే మోహన్ బాబు చెప్పిన ఈ7 వేల ఎకరాల మాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ ఈ విషయం తెలిసి షాక్ అయిపోతున్నారు.. అంతేకాదు విష్ణువర్ధన్ బాబు కోసమే న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్నాను అంటూ మోహన్ బాబు చెప్పడంతో సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.మంచు ఫ్యామిలీ అంటేనే ఎక్కువగా ట్రోల్స్ వినిపించే ఫ్యామిలీ..

అలాంటిది అప్పుడప్పుడు వీళ్ళు చేసే కామెంట్ల ద్వారా మాటల ద్వారా సోషల్ మీడియాలో విమర్శలకు గురవుతారు.అలా తాజాగా న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్నానంటూ ట్రోలింగ్ కి గురవుతున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు మాట్లాడిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలా మంది జనాలు ఈ వీడియో కింద మోహన్ బాబుని ఏకిపారేస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరీ ఇంత ఎదవలా కనిపిస్తున్నామా మీకు.. న్యూజిలాండ్ లో ఎకరా భూమి మరీ అంత చీపా.. 7000 ఎకరాలు కొనేంత డబ్బు మీ దగ్గర ఉన్నాయా.. న్యూజిలాండ్ లో మీకు అంత చీప్ గా భూమి ఇచ్చింది ఎవరు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..

ఇక మరికొంత మందేమో ఆస్తుల విషయంలో మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ కి పూర్తిగా ద్రోహం చేస్తున్నారని,ఉన్న డబ్బులన్ని పెద్ద కొడుకు విష్ణుకే ఖర్చు పెడుతున్నారని మండిపడుతున్నారు. అయితే న్యూజిలాండ్ లో ఏడూ ఎకరాలు కొన్నాను అంటూ మోహన్ బాబు చేసిన ఈ వీడియో ఏదో సరదా కోసం మాత్రమేనని.. నిజంగా అక్కడ ఆయన అంత భూమి కొనలేదు కేవలం సరదా కోసం మాత్రమే ఆ వీడియో చేసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: