
నాగార్జున దారిలోకి నేను కూడా వచేస్తానని అనుకుంటున్నానని నాకు చాలా విషయాల్లో నాగ్ స్ఫూర్తి అని చిరంజీవి కామెంట్లు చేశారు. స్థితప్రజ్ఞత, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం విషయంలో నాగ్ నాకు నచ్చుతారని చిరంజీవి చెప్పుకొచ్చారు. కుబేర సినిమాతో నాగార్జున నాకు కూడా ఒక దారి చూపించారని భవిష్యతులో ఓటీటీ కోసం డైరెక్ట్ సినిమా చేయాల్సి వచ్చినా మానసికంగా సిద్ధంగా ఉండాలని ఈ విషయంలో నాగ్ నాకు స్ఫూర్తిగా నిలిచారని చిరంజీవి అన్నారు.
ఓటీటీ ప్లాన్స్ గురించి చిరంజీవి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒకింత గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సరైన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడం మేకర్స్ కు సవాలుగా మారింది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. చిరంజీవి పారితోషికం 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. చిరంజీవి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. చిరంజీవి ఏడు పదుల వయసులో ఏ స్థాయిలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.