పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలో మొదలు పెట్టాడు. కానీ ఈ సినిమా షూటింగ్ చాలా డిలే అవుతూ ఉండడంతో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ తప్పుకున్నాడు. దానితో ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్ను రూల్స్ రంజాన్ మూవీ దర్శకుడు అయినటువంటి జ్యోతి కృష్ణ పూర్తి చేశాడు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏ ఏం రత్నం ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

మూవీ ని కొంత కాలం క్రితం జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పెండింగ్లో ఉన్నట్లు , కొత్త విడతల తేదీని మరి కొన్ని రోజుల్లో ప్రకటిస్తామని ఈ మూవీ యూనిట్ ఆ తర్వాత ప్రకటించింది. ఇక తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాని జూలై 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా యొక్క కేరళ థియేటర్ హక్కులను అమ్మి వేసింది. 

మూవీ యొక్క కేరళ థియేటర్ హక్కులను హీరోగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ సంస్థ అయినటువంటి వే ఫరెవర్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను కేరళ ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి దుల్కర్ సల్మాన్ ప్రయత్నాలు ఇప్పటి నుండే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క కేరళ హక్కులు దుల్కర్ సల్మాన్ చేతికి వెళ్లడంతో ఈ సినిమాకు కేరళ ఏరియాలో మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: