టాలీవుడ్ నటుడు నితిన్ కొంత కాలం క్రితం వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. గతంలో నితిన్ , వెంకీ కుడుముల కాంబోలో రూపొందిన భీష్మ సినిమా మంచి విజయం సాధించి ఉండడం , అలాగే వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఛలో , భీష్మ రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో కచ్చితంగా రాబిన్ హుడ్ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని చాలా మంది భావించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది.

నితిన్ తాజాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన తమ్ముడు అనే సినిమాలో హీరోగా నటించాడు. వర్ష బోలమ్మ , సప్తమి గౌడ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమాను జూలై 4 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా తమ్ముడు సినిమా బడ్జెట్ కు సంబంధించిన కీలక విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజాగా దిల్ రాజు "తమ్ముడు" మూవీ బడ్జెట్ గురించి మాట్లాడుతూ ... తమ్ముడు సినిమాకు 35 కోట్లు ఖర్చు పెట్టాం అని ఆయన చెప్పాడు. ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాయి. దానితో నితిన్ కోసం దిల్ రాజు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు అంటే ఈ సినిమాలో కచ్చితంగా మంచి కంటెంట్ ఉండి ఉంటుంది. ఈ మూవీ తో నితిన్ కి మంచి విజయం దక్కుతుంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: