
ఈ విషయాన్ని తమన్నా, విజయ్ అధికారికంగా వెల్లడించకపోయినా.. పరోక్షంగా ధ్రువీకరించారు. అయితే సాధారణంగా హీరోయిన్స్ బ్రేకప్ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. కానీ తమన్నా మాత్రం అందుకు పూర్తిగా భిన్నం అనిపించుకుంది. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తుంది. బ్రేకప్ అయిన కూడా ఆ ప్రభావం కెరీర్ పై పడకుండా జాగ్రత్త పడుతూ దూసుకుపోతుంది. తాజాగా క్రేజీ లైనప్ తో మాజీ ప్రియుడికి పరోక్షంగా మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.
ప్రస్తుతం తమన్నా చేతితో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. జగన్ శక్తి డైరెక్టర్ చేస్తున్న అడ్వెంచర్ ఫిల్మ్ `రేంజర్` లో హీరో అజయ్ దేవగన్‌కు జోడిగా తమన్నా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సూపర్ హిట్ `నో ఎంట్రీ`కి సీక్వెల్ గా `నో ఎంట్రీ 2` రాబోతుంది. అనీస్ బాజ్మి ఈ చిత్రానికి డైరెక్టర్ కాగా.. వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, దిల్జీత్ సింగ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలోనూ తమన్నా ఛాన్స్ దక్కించుకుంది.
బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా `వివాన్` అనే సినిమాలో మిల్కీ బ్యూటీ యాక్ట్ చేస్తోంది. ఈ థ్రిల్లర్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా సిద్ధమవుతోంది. మరోవైపు రోహిత్ శెట్టి దర్శకత్వంలో తమన్నా ఓ బయోపిక్ కు సైన్ చేసింది. ఇందులో జాన్ అబ్రహం హీరో కాగా.. తమన్నా ఫీమెయిల్ లీడ్‌గా అలరించబోతుంది. వీటితో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేందుకు తమన్నా కథలు వింటోంది.