
ఇందులో ఏఎన్ఆర్ నటించిన కథలోని ఎమోషన్స్ ను గుర్తుచేస్తూ హైలెట్ గా మార్చేసింది. దేవదాసు సినిమా గురించి ఇప్పుడు జనాలు పెద్దగా మాట్లాడుకోకపోవచ్చు. కానీ మన తాతలు మాత్రం ఓ రేంజ్ లో ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు . అప్పట్లో ఏఎన్నార్ ఈ సినిమా కోసం చేసిన ఒక ర్స్కీ పని హైలెట్గా మారింది. అసలు ఇప్పటివరకు ఏ హీరో కూదా చేయలేకపోయారు . అక్కినేని నాగేశ్వరరావు భావోద్వేగని ప్రపంచానికి మరొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ సినిమా షూటింగ్ కోసం చాలా చాలా కష్టపడ్డాడట అక్కినేని నాగేశ్వరావు . మరీ ముఖ్యంగా రాత్రివేళ షూటింగ్ కారణంగా అక్కినేని తగినంత నిద్ర లేక ఆయన చాలా అనారోగ్య పాలయ్యారట . అంతేకాదు తాగుబోతుగా కనిపించాలి అంటూ ఆయన రకరకాల టిప్స్ కూడా ఫాలో అయ్యారట . అంతేకాదు బక్క చికిపోయినట్లు కళ్ళల్లో జీవం లేకుండా ఉండేటట్లు కనిపించడానికి ఏకంగా కొన్ని రోజులపాటు ఆహారం కూడా తీసుకోలేదట . కేవలం మంచినీరు మాత్రమే తాగుతూ ఆయన ఈ సినిమా షూటింగ్ ని కొన్ని రోజులపాటు కంప్లీట్ చేశారట .
అంతేకాదు ఈ సినిమాని బాలీవుడ్ లో కూడా ఆయన నటించేలా చాలామంది అప్పట్లో ఫోర్స్ చేశారట. కానీ ఏఎన్ఆర్ మాత్రం నేను చేయనే చేయను అంటూ తెగేసి చెప్పేసారట. అలాంటి పాత్ర ఒకసారి చేయగలం రెండోసారి చేసిన అంత న్యాయం చేయలేకపోవచ్చు ..ఆ పాత్రని అలాగే చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండనివ్వండి అంటూ తేల్చి చెప్పేసారట. దేవదాసు పాటలకు ఇప్పటికీ క్రేజ్ అలానే ఉంది. "అంతా భ్రాంతియేనా.. జగమే మాయ.. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్" ఇలాంటి పాటలు ఇప్పటికీ పలుగురు ప్లే లిస్ట్ లో మారుమ్రోగిపోతూనే ఉంటాయి..!!