సాధారణంగా ఏ స్టార్ హీరో కైనా ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేయడం కామన్ . కానీ ఒక పాన్ ఇండియా లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాక కూడా ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తారా ..?? అంటే ఎన్టీఆర్ పరిస్థితి చూస్తే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి క్రేజ్ తో  దూసుకుపోతున్నారు అనేది. ఇండస్ట్రీలో ఎంతోమంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు . కానీ ఎన్టీఆర్ కి ఉన్న  ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మిగతా ఏ హీరోకి లేదనే చెప్పాలి . మరి ముఖ్యంగా బాలీవుడ్ జనాలు ఎన్టీఆర్ అంటే పడి చచ్చిపోతున్నారు.
 

ఆయన నటించిన వార్ 2 సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ..?? అంటూ వెయిట్ చేస్తున్నారు . కాగా ఎన్టీఆర్ కీలకపాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమా షూట్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది.  కేవలం ఒక్క పాట మినహా మిగతా షూట్ అంతా కంప్లీట్ చేసేసింది చిత్ర బృందం . ఈ పాట షూటింగ్ కోసమే ముంబై వెళ్లాడు జూనియర్ ఎన్టీఆర్ . అక్కడ ఆయన చేతిలో కనిపించిన బుక్ త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన విషయాన్ని ఆల్మోస్ట్ ఆల్ అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసినట్లైంది.



కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక సతమతమైపోతున్నార. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూట్స్లో పాల్గొన్నారు.కాగా ఈ షూట్ కంప్లీట్ అయిపోగానే ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో తెరకెక్కే  సినిమా షూట్ లో పాల్గొనాలి . ఆ తర్వాత దేవర 2  సెట్స్ పైకి తీసుకురావాలి . ఇక అదే మూమెంట్లు త్రివిక్రమ్ తో తెరకెక్కే  సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలి . ఒకే టైంలో మూడు సినిమాలకు సంబంధించిన కాల్ షీట్స్ ని అడ్జస్ట్ చేయలేక సతమతమైపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ న్యూస్ తెరపైకి వచ్చింది . సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కమిట్మెంట్ విషయంలో ఎప్పుడు పక్కాగా ముందుకు వెళ్తారు . కానీ ఈసారి కొంచెం కన్ఫ్యూజన్లో ఒకే కాల్ షీట్స్ ని  రెండు సినిమాలు కి ఇచ్చేశారని .. మరి అది ఎలా మ్యానేజ్  చేస్తాడో జూనియర్ ఎన్టీఆర్ చూడాలి అంటున్నారు సినీ ప్రముఖులు . దేవర 2 కి అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి భారీ క్లాష్ ఏర్పడిపోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: