మంచు విష్ణు సక్సెస్ చూసి దశాబ్దం పైనే అయిపోయింది. విష్ణు గత చిత్రాలు `ఓటర్`, `మోసగాళ్లు`, `జిన్నా` బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ గా నిలిచాయి. దాదాపు మూడేళ్ల గ్యాప్ అనంతరం మంచు విష్ణు తాజాగా `కన్నప్ప` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మోహన్ బాబు నిర్మించిన ఈ హిందూ ఇతిహాస భక్తి చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. అయితే కన్నప్ప హిట్‌ నేపథ్యంలో మంచు విష్ణు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.


ఇప్పటికే తన తదుపరి సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనుందని మంచు విష్ణు వెల్లడించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. విష్ణు తదుపరి చిత్రం ప్రముఖ నటుడు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రభుదేవాకు దర్శకత్వంలోనూ పట్టుంది. గతంలో తెలుగులో `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `పౌర్ణమి`, `శంకర్ దాదా జిందాబాద్` వంటి చిత్రాలకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు.


అలాగే అటు తమిళ్, హిందీ భాషల్లోనూ కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు. చివరిగా 2021లో సల్మాన్ ఖాన్ తో `రాధే` సినిమాను తెర‌కెక్కించిన ప్రభుదేవా.. లాంగ్ గ్యాప్ అనంతరం మరోసారి మంచు విష్ణుతో చేయ‌బోయే సినిమా కోసం మెగా ఫోన్ పట్టబోతున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించేబోయే ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడెక్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: