తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత పాపులారిటీ కలిగినటువంటి నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.. ఈయన బ్యానర్ లో వచ్చిన చాలా చిత్రాలు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా దిల్ రాజ్ కొత్త దర్శకులకు, నటినటులకు ఛాన్సులు ఇస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ఆ విధంగా పెద్ద సినిమాల నుంచి మొదలు చిన్న సినిమాలు వరకు కూడా ఆయన నిర్మాణ సారథ్యంలో చాన్సులు ఇస్తారు. అలాంటి దిల్ రాజ్ సినిమాల విషయాన్ని పక్కన పెడితే  తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాను డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా ఏ విధంగా మారారో ఎలాంటి కృషి చేశారో చాలా సందర్భాల్లో వివరిస్తూ వచ్చారు. 

అలా దిల్ రాజ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే అనిత రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పిల్లలు పుట్టిన తర్వాత 2017లో ఆమె మరణించింది. ఆ తర్వాత దిల్ రాజ్ తన కూతురికి పెళ్లి చేసి, రెండో పెళ్లి 2020లో చేసుకున్నారు. రెండవ భార్య పేరు తేజస్విని. వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు.. అయితే తేజస్విని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దిల్ రాజ్ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.. అయితే తేజస్వినికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయనను ఎప్పుడో ఒకసారి కలవాలని చాలాసార్లు ట్రై చేసిందట. అయితే ఈ విషయాన్ని దిల్ రాజుకు కూడా చెప్పిందట.

దిల్ రాజు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చిత్రం వకీల్ సాబ్. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ను కలవాలని తేజస్విని దిల్ రాజును బాగా ఒత్తిడి చేయడంతో ఆయన పవన్ కళ్యాణ్ ను అడగడానికి కాస్త మొహమాట పడ్డారట. కానీ తేజస్విని ఒత్తిడి చేయడంతో చివరికి ఆమెను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ తో మాట్లాడించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మహిళల గురించి వారి గొప్పతనం గురించి చాలా బాగా చెప్పారని తేజస్విని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ విధంగా దిల్ రాజును పవన్ కళ్యాణ్ ను కల్పించడం కోసం చాలా ఇబ్బంది పెట్టానని ఆమె అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: