రాజమౌళి..  ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్.  కాదు కాదు ఇండస్ట్రీలో ఒక సర్టెన్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించే వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ . ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అభిమానులు.  మరీ ముఖ్యంగా రాజమౌళి ఫ్యాన్స్ అయితే ఆయన తీసే ప్రతి సినిమాను లైక్ చేస్తూ ఉంటారు.  జనాల నాడి పట్టుకుని వాళ్ళకి ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది అని ఆలోచించి తెరకెక్కించే  డైరెక్టర్లలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు ఈ రాజమౌళి.  ప్రెసెంట్ మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు రాజమౌళి .


అంతే కాదు మహేష్ బాబును కూడా అంతే కష్ట పెడుతున్నాడు. ఏకంగా 365 రోజులు ఒక లుక్ కోసమే మహేశ్ ని కష్టపెట్టేసాడు . కాగా ఇప్పుడు ప్రియాంక చోప్రా వంతు వచ్చింది . ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . ప్రియాంక చోప్రా కు ఈ సినిమా కోసం స్పెషల్ గా ఒడిస్సా నృత్యాన్ని నేర్చుకోవాలి అంటూ ఆర్డర్ చేశారట రాజమౌళి . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒడిస్సా నేపథ్యం ఈ సినిమాకి చాలా చాలా కీలకమట . అక్కడ పేరెన్నికగన్న ‘మయూర్‌ భంజ్‌ ఛౌ’ అనే నృత్యాన్ని నేర్చుకోవాల్సిందిగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి..హీరోయిన్  ప్రియాంక చోప్రాకి స్ట్రిక్ట్ ఆర్డర్‌ పాస్‌ చేశారట . దాంతో ఈ నృత్యంలో ప్రసిద్ధి చెందిన ఒడిశా కళాకారుడు విక్కీ భర్తయ ఆధ్వర్యంలో ప్రియాంక చోప్రా ఈ నృత్యాన్ని అభ్యసించిన్నట్లు తెలుస్తుంది.



మూడు విభిన్న రీతుల్లో ఈ నృత్యం ఉంటుందని సమాచారం అందుతుంది. . ప్రియాంకకు నృత్యం నేర్పిన  భర్తయా రీసెంట్గా ఓ విషయాన్ని మాట్లాడుతూ .."ప్రియాంకకు నృత్యం నేర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నా.. అది ఒక గొప్ప అనుభవం నృత్యాన్ని అభ్యసించడంలో చూపించిన ఆసక్తి అందరికీ స్ఫూర్తిదాయకం .. పెద్ద హీరోయిన్ అన్న భావన తనకి ఎక్కడా కూడా లేరు . చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతుంది . ఈ ప్రతిష్టాత్మక ప్రయాణంలో నేను ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది "అంటూ తెలిపారు . కాగా ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ట్రెజర్ హంట్ మూవీగా ఇప్పటివరకు వార్తలు వినిపిస్తూ వచ్చాయి . ఈ సినిమాల్లో మహేష్ బాబు పాత్ర పేరు గౌతమ్ అంటూ కూడా న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడేమో ఒడిస్సా నేపథ్యం అంటున్నారు మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా  వెయిట్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: