సినిమా ఇండస్ట్రీ లోకి కొంత మంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. అలా చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న బ్యూటీలు ఎవరు అనేది తెలుసుకుందాం.

నిత్యా మీనన్ : ఈ ముద్దుగుమ్మ అలా మొదలైంది అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని, మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ బ్యూటీ ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ నటి ఇంగ్లిష్ చిత్రం “ద మనీ హు నో టూ మచ్(1998 )”లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

హన్సిక : ఈమె దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మెదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ లో కెరియర్ లో ముందుకు సాగించింది. ఈమె కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

కీర్తి సురేష్ : ఈ బ్యూటీ నేను శైలజ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన నేను లోకల్, మహానటి సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఈమె తెలుగు లో తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈమె తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

కావ్య కళ్యాణ్ రామ్ : ఈ బ్యూటీ ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె మసూద సినిమాతో హీరోయిన్గా కెరియర్ను మొదలు పెట్టింది. ఈ మూవీ తో ఈ బ్యూటీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన బలగం సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆఖరుగా ఈమె ఉత్సద్ అనే మూవీ లో హీరోయిన్గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: