సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి తాజా గా నటిస్తున్న మూవీ ఘాటీ . స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకేక్కుస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ , ఫస్ట్ ప్రైమ్ ఎంటర్టైర్మెంట్స్ బ్యానర్ పై వంశీకృష్ణ , రాజీవ్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .. ఇక ఈ సినిమా లో అనుష్క కు జంటగా కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు .. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమా గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది .. అయితే ఈ సినిమా ను ముందుగా ఏప్రిల్ 18న రిలీజ్ కావాల్సి ఉండగా ప‌లు అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి జూలై 18న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్ ..

అయితే ఇప్పుడు ఈ సినిమా మరోసారి వాయిదా పడుతున్నట్టు టాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది .. అందుకు కారణం ఇంకా ఈ సినిమా కు సంబంధించిన సిజి పనులు కంప్లీట్ కాలేదని ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని రిలీజ్ లోపు కంప్లీట్ చేయడం కుదరదని తెలుస్తుంది .. ఇక దీని పై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని కూడా అంటున్నారు .. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది .. ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అనుష్క అభిమానులకు ఇది భారీ షాక్ అనే చెప్పాలి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: