
అన్ని అవాంతరాలు దాటుకుని ఈనెల 24న ఈమూవీని విడుదల చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ నిర్మించిన ఏ. ఎమ్ రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈమూవీని పూర్తి చేసి విడుదల చేస్తున్నారు. అనేకశార్లు ఈసినిమా వాయిదా పడటంతో ఈమూవీ పై పవన్ అభిమానులలో కూడ నిన్నమొన్నటి వరకు పెద్దగా క్రేజ్ కనిపించలేదు.
అయితే ఈమూవీ ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఈమూవీ ట్రైలర్ కు వస్తున్న స్పందన హాట్ టాపిక్ గా మారింది. 16వ శతాబ్ధంలో అలానాటి భారతదేశాన్ని మొగల్ చక్రవర్తి ఔరంగజేబు పరిపాలించిన కాలంనాటి కథలో ఆచక్రవర్తి అకృత్యాలను అడ్డుకునే లక్ష్యంతో గోల్కొండ నుంచి బయలుదేరిన ఒక యోధుడి కథ ‘హరిహర వీరమల్లు’ దేశసంపదగా పేరుగాంచిన కోహినూర్ వజ్రం కాపాడే బాధ్యతను తీసుకున్న హీరోగా హిందూ ధర్మాన్ని నిలబెట్టి భారతదేశ సార్వభౌమాధికారాన్ని రక్షించే దేశ భక్తుడుగా వీరమల్లు కర్తవ్య నిర్వహణలో వచ్చిన అడ్డంకులు ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానంగా పవన్ పాత్రను చాల పవర్ ఫుల్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ డిజైన్ చేసినటట్లు కనిపిస్తోంది..
ఈమూవీ ట్రైలర్ అంచనాలకు మించి ఉండటంతో పవర్ స్టార్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోయారు. ఈ ట్రైలర్ లో ఉన్న పులిని వేటాడే బెబ్బులి, నేను రావద్దని కోరుకుంటున్నారు లాంటి డైలాగులు పవన్ కళ్యాణ్ నోటి వెంట విన్న అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు ఆర్ట్ వర్క్, విఎఫ్ఎక్స్ క్వాలిటీ అన్నీ బాగున్నట్లుగా కనిపిస్తూ ఉండటంతో పవన్ అభిమానుల కోరిక తీర్చే కలక్షన్స్ హంగామా ‘హరిహర వీరమల్లు’ సృష్టిస్తుందా అన్న ఆశలు అభిమానులలో కలుగుతున్నాయి..