డైరెక్ట‌ర్ కె.వి. అనుదీప్ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 2016లో `పిట్టగోడ` మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనుదీప్.. 2021లో `జాతి రత్నాలు` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఈ ఒక్క సినిమా ఆయనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత `ప్రిన్స్` మూవీతో ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన‌ప్ప‌టికీ స‌రైన ఫ‌లితం ద‌క్క‌లేదు. ప్రస్తుతం అనుదీప్ డైరెక్టర్ గా కన్నా నటుడుగానే ఎక్కువ బిజీగా గడుపుతున్నాడు. ముఖ్యంగా గెస్ట్ రోల్స్ కు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు. అందులో భాగంగానే ఇటీవ‌ల `మ్యాడ్, `మ్యాడ్‌ స్క్వేర్`, `క‌ల్కి 2898 ఏడీ` చిత్రాల్లో మెరిశాడు.


అలాగే మరోవైపు కొందరు తమ సినిమా ప్రమోషన్స్ కు కూడా అనుదీప్‌ను గట్టిగా వాడేసుకుంటున్నారు. అయితే తాజాగా అనుదీప్ ఘోర అవమానం జరిగింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ ఈవెంట్ కు డైరెక్టర్ అనుదీప్ ను గెస్ట్‌ ఆహ్వానించారు. ప‌వ‌న్ మూవీ అంటే క్రౌడ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ క్రౌడ్ ను కంట్రోల్ చేయ‌డానికి పోలీసులు ప‌డ్డ తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావు.


అయితే ఆహ్వానం రావ‌డంతో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అనుదీప్ హాజ‌ర‌య్యాడు. సాధార‌ణంగానే చాలా సింపుల్ గా ఉండే ఆయ‌న‌.. క్రౌడ్ మధ్యలో నుంచి నడుచుకుంటూ స్టేజి పైకి వెళ్ళబోయాడు. సాధార‌ణ వ్య‌క్తిలా రావ‌డంతో అనుదీప్ ని గుర్తుప‌ట్ట‌లేక‌పోయిన కొందరు పోలీసులు ఆయ‌న్ను టక్కున వెనక్కి నెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. `పోలీసులు అలా తోసేసారేంటి మావ.. పాపం అనుదీప్.. ఆయ‌న ఒక డైరెక్ట‌ర్ అని గుర్తించండ‌య్యా` అంటూ వీడియో చూసిన నెటిజ‌న్లు ఫ‌న్నీగా రియాక్ట్ అవుతున్నారు.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: