
అయితే ఈ గ్యాప్ లో విక్టరీ వెంకటేష్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించేందుకు శ్రీకారం చుట్టారు. ఇంతవరకు అధికారిక ప్రకటన రానప్పటికీ.. సైలెంట్ గా ఈ సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వెంకీ కెరీర్ లో 77వ చిత్రిమిది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మరి కొద్ది రోజుల్లో వెంకీ-త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. వెంకీతో చేయబోయే చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ `వెంకట రమణ` అనే క్రేజీ టైటిట్ ను లాక్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ టైటిల్ కు `కేర్ ఆఫ్ ఆనంద నిలయం` అనేది ట్యాగ్ అని టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు