
వార్ 2 సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ సంబంధించి డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఇక ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ఇద్దరు ఇండియాలోనే బెస్ట్ డాన్సర్స్ కావడం తో వీళ్ళిద్దరూ డాన్స్ చూస్తుంటే చూడాలని అభిమానులు కూడా ఎంతగానో కోరుకున్నారు. అందుకు ఇప్పుడు అభిమానుల ఆశలు నిజం చేస్తూ అదిరిపోయే సాంగ్ ప్లాన్ చేశారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ .. అలాగే ఈ సాంగ్ ను గతంలోనే షూట్ చేసేందుకు ప్లాన్ చేసిన హృతిక్ గాయపడటం తో కొంత ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు హీరోలు ఇద్దరు రెడీ అనడంతో ఈరోజు నుంచి ఈ సాంగ్ షూట్ చేయనుంది చిత్ర యూనిట్ ..
ముంబైలో వేసిన భారీ సెట్ లో వారం రోజులు పాటు ఈ సాంగ్ను చిత్రీకరించబోతున్నారు. అలాగే ఈ ఇద్దరు హీరోల డాన్స్ వార్ ను వెండి తెరమీద చూడాలంటే ఆగస్టు 14 వరకు ఆగాల్సిందే . వార్ 1లో హృతిక్ ,టైగర్ కలిసి కనిపించారు .. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ పాటని కూడా చేశారు .. ఆ సాంగ్ సినిమా సక్సెస్ లోనూ కీలక పాత్ర పోషించింది. ఇక ఇప్పుడు అలాంటి పాటనే వార్ 2 కోసం కూడా రెడీ చేస్తున్నారు .. కానీ ఈసారి స్కేల్ తో పాటు డాన్స్ మూవ్మెంట్ విషయం లో కూడా ఎంతో ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారు చిత్ర యూనిట్ .