
అయితే ప్రస్తుతం రవితేజ భాను భోగవరపు డైరెక్షన్లో ‘మాస్ జాతర’ అనే మూవీ చేస్తున్నాడు .. సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది .. అలాగే ఓటీటీ రైట్స్ కూడా నెట్ ఫ్లిక్స్ మంచి రేట్ కే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మాస్ జాతర పనులు ఇంకా కంప్లీట్ కాకుండానే కిషోర్ తిరుమల దర్శకత్వం లో మరో కొత్త సినిమాను మొదలుపెట్టడు రవితేజ .. అయితే ఇది పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని తెలుస్తుంది .. బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది .
ఇక దీన్నిబట్టి త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తుంది . అయితే రవితేజ రెమ్యూనరేషన్ విషయం లో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదట .. మరోవైపు బడ్జెట్ లెక్కలు కూడా భారీగానే ఉన్నాయి .. అందుకే మాస్ జాతర రిజల్ట్ బట్టి చూద్దామని చెప్పి .. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది .. మరోవైపు మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో కూడా మరో సినిమా మొదలు పెట్టాలని కూడా రవితేజ చూస్తున్నారు .. ఇక మరి చూడాలి ఏం జరుగుతుందో ..