
అయితే రాజేంద్రప్రసాద్ తర్వాత ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి వారసులెవరో ఇండస్ట్రీలోకి రాలేదు. రాజేంద్రప్రసాద్ కు ఇద్దరు సంతానం. కూతురు గాయత్రి కాగా.. కుమారుడు బాలాజీ ప్రసాద్. కూతురు ఇటీవలే గుండెపోటుతో మరణించారు. ఆ సంగతి పక్కన పెడితే.. కుమారుడు బాలాజీ ప్రసాద్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని రాజేంద్రప్రసాద్ ఎంతగానో ఆరాటపడ్డారు. కానీ అది జరగలేదు. అసలు భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా బాలాజీ ప్రసాద్ హీరో ఎందుకు కాలేకపోయాడు? అడ్డుపడిందెవరు? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రాజేంద్రప్రసాద్ మాదిరిగానే ఆయన కుమారుడు బాలాజీ ప్రసాద్ కూడా మంచి పర్సనాలిటీతో ఉండేవారు. హీరో అయ్యే లక్షణాలు ఉండటంతో తనయుడి ఫిల్మ్ ఎంట్రీకి రాజేంద్రప్రసాద్ సన్నాహాలు చేశారు. `భాగ్యలక్ష్మి బంపర్ డ్రా`, `అందరూ దొంగలే` వంటి కామెడీ చిత్రాలు తీసిన నిధి ప్రసాద్ దర్శకత్వంలో బాలాజీ ప్రసాద్ ను టాలీవుడ్‌కు పరిచయం చేయాలని రాజేంద్రప్రసాద్ భావించారు. ఆయన కోరుకున్నట్లే బాలాజీ ప్రసాద్ డెబ్యూ ఫిల్మ్ ప్రారంభమైంది. కొంత షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది.
కానీ అనివార్య కారణాలతో సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది. చాలా కాలం సినిమా రీస్టార్ట్ కాకపోవడంతో బాలాజీ ప్రసాద్ నిరాశకు గురయ్యాడు. తొలి సినిమాకే అలా జరగడంతో విరక్తి చెందిన బాలాజీ ప్రసాద్.. ఇండస్ట్రీని వదిలేశాడు. రాజేంద్ర ప్రసాద్ ఎంత నచ్చజెప్పాలని చూసిన ఆయన వినలేదు. మళ్లీ సినిమాల వైపు చూడలేదు. ఎక్స్‌పోర్ట్ బిజినెస్ లోకి అడుగుపెట్టి అందులోనే బాలాజీ ప్రసాద్ సెటిల్ అయ్యారు.