టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన నాగవంశీ జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులతో ఒకరనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో నాగవంశీ వార్2 హక్కులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వార్2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తామే నిర్వహిస్తామని నాగవంశీ చెప్పుకొచ్చారు. డిస్ట్రిబ్యూటర్ల సూచనలకు అనుగుణంగా వార్2 తెలుగు రైట్స్ ను కొనుగోలు చేయడం ఆయన తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో వార్2 సినిమా ట్రైలర్  ప్రదర్శితం కానుందని తెలుస్తోంది. అభిమానులకు  ఈ వార్త  శుభవార్త అనే చెప్పాలి. హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ థియేటర్లలో  ప్రదర్శితం కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ లో పాల్గొంటే వార్2 కొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. యశ్  రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో  తెరకెక్కిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తుందని  ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.  వార్2 సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట  వేశారని సమాచారం అందుతోంది.  వార్2 సినిమా  ఏ స్థాయిలో  సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను  సొంతం చేసుకుంటే వార్2  సాధించే రికార్డులు అన్నీఇన్నీ  కావు. తారక్ రాజమౌళి  కాంబోలో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.  యంగ్  టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులను  సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ  పెరుగుతోంది.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ రిలీజ్ దక్కేలా  నాగవంశీ  ప్లాన్ చేస్తారేమో చూడాల్సి ఉందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: