
కాగా సోషల్ మీడియాలో "హరిహర వీరమల్లు" సినిమాకి సంబంధించి నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా వైసిపి నేతలు . అభిమానులు హరిహర వీరమల్లు సినిమాని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు . నిజమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎవరు కూడా ఈ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని చూడనే చూడకూడదు అంటూ గట్టిగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది . అందులో ఉన్నది హరిహర వీరమల్లు సినిమా డైరెక్టర్ జ్యోతి కృష్ణ కావడంతో ఈ వీడియో మరింత స్థాయిలో వైరల్ అయిపోతుంది .
రీసెంట్ గానే హైదరబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే . తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు మీద అనుమతులుఇచ్చింది . ఓవర్ క్రౌడ్ రాకుండా చూసుకునే బాధ్యత పూర్తిగా నిర్మాత దే అంటూ ఈవెంట్ బయట జనాలు గుమ్మి కూడి రచ్చ చేసిన నిర్మత బాధ్యత వహించాలి అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఎటువంటి అవాంఛనీయఘటనలు జరగకుండా చాలా సాఫీగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిపోయింది . అయితే ఈవెంట్ ప్రశాంతంగానే సాగింది కానీ ఇప్పుడు జ్యోతి కృష్ణ ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నారు .
శిల్పకళా వేదిక బయట హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణకి పోలీసులకి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది . పోలీసులు జ్యోతి కృష్ణ కారుని ఆపడంతో ఆయన కిందకు దిగి పోలీసులతో గొడవ పెట్టుకున్నాడు . ఎప్పుడు సైలెంట్ గా ఉండే జ్యోతి కృష్ణ కొంచెం గొంతు పెద్దది చేసి అరవడం వీడియోలో తెలుస్తుంది . "ఎందుకు కారుని కొడుతున్నావ్" అంటూ మండిపడ్డాడు . గొడవ పెద్దతి అయ్యే పరిస్థితి ఉండడంతో మధ్యలో ఈవెంట్ కి సంబంధించిన వాళ్ళు కలగజేసుకొని జ్యోతి కృష్ణని కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు . కూల్ గా నవ్వుతూ ఉండే జ్యోతి కృష్ణ ఇంత సీరియస్ అయిపోవడానికి కారణం ఏంటి..?? అనేది సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే కొంతమంది వైసిపి నేతలు, శ్రేణులు ఈ వీడియోని హరిహర వీరమల్లు కి నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు . ఎప్పుడు సైలెంట్ గా ఉండే జ్యోతి కృష్ణ ఫస్ట్ టైం కొంచెం అరవడంతో ఇది హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్ పై ఎఫెక్ట్ పడేలా చేస్తుంది ఏమో...?? అనే విధంగా సినీ విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటూ ఉండటం గమనార్హం..!!