"పవన్ కళ్యాణ్" ఫ్యాన్స్ డిమాండ్లు మామూలుగా ఉండవు.  పవన్ కళ్యాణ్ ఏం చేయాలి అనుకుంటున్నారో.. పవన్ కళ్యాణ్ ఏం చేస్తే అభిమానులు లైక్ చేస్తారో అన్న విషయాలను సోషల్ మీడియా వేదికగా ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు . ఇన్నాళ్లు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్డేట్ రాలేదు .. హిట్ కొట్టలేదు అంటూ తెగ బాధ పడిపోయారు. ఎట్టకేలకు చక చక హరిహర వీరమల్లు సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకుని థియేటర్స్ లో  రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ .



పోనీలే ఎలాగోలా కష్టపడి తన ఖాతాలో హిట్ వేసుకున్నాడు అని ఆనందపడే లోపే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కొత్త కోరిక పుట్టుకొచ్చింది . కచ్చితంగా పవన్ కళ్యాణ్ మా కోరిక తీర్చాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వచ్చిన కొత్త కోరిక ఏంటో తెలుసా..? "ఖుషి" సినిమా స్టైల్ లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేస్తే చూడాలి అంటూ ఆశపడుతున్నారు. ఇది చాలా చాలా కష్టం.  ఖుషి సినిమాలో నటించేటప్పుడు పవన్ కళ్యాణ్ ఏజ్ వేరు ఇప్పుడు ఏజ్ వేరు . పైగా ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం .




కొన్ని కొన్ని పాత్రల్లో ఆయన నటించకపోవడమే బాగుంటుంది.  అది ఆయన పొలిటికల్ కెరియర్ కి చాలా చాలా మేలు . ఇక అమ్మాయిలతో నాటి స్టెప్స్ వేస్తే అస్సలు చూడలేరు ప్రజలు . ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక హీరోగా కన్నా కూడా ఒక రాజకీయ నేతగానే జనాలు లైక్ చేస్తున్నారు.  ఈ విషయం గమనించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ ఆశను వదులుకుంటేనే బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు.  పవన్ కళ్యాణ్ ఇక నటించేది కొన్ని సినిమాలలోనే . అయితే ఆ సినిమాలోనైనా ఇలా ఒక నాటి స్టెప్స్ వేస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన హరిహర వీరమల్లు సినిమాలో కూడా పెద్దగా చెప్పుకోతగ్గ స్టెప్స్ లేవు . అలా అలా సింపుల్ గా తూతూ మంత్రంగా ఫినిష్ చేశారు . పవన్ కళ్యాణ్ "ఖుషి" సినిమా రేంజ్ లో అమ్మాయే సన్నగా పాటలో వేసిన స్టెప్స్ వేస్తే బాగుంటుంది అని ఆశపడుతున్నారు.  అది ఇక ఈ జన్మలో జరగని పని అని అందరికీ తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: