
ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని నేపథ్యంలో సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం క్రిష్ జాగర్లమూడి ప్రారంభించగా, ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీతం ఎం.ఎం. కీరవాణి అందించారు. మనోజ్ పరమహంస మరియు జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కే.ఎల్. ఎడిటింగ్ చేశారు.
విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఈ సినిమా మరింత బెటర్ రిజల్ట్ ను అందుకునేది. ఈ సినిమాకు ఇప్పటివరకు 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాగా ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా ఖాతాలో ఈ రికార్డ్ చేరుతుందని చెప్పవచ్చు.
హరిహర వీరమల్లు సినిమా ఎక్కువ కాలం పాటు షూటింగ్ జరుపుకోవడం, క్రిష్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఈ సినిమాకు మైనస్ అయింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా దర్శకుడు క్రిష్ కు మాత్రం ఎలాంటి నష్టం లేదని చెప్పవచ్చు. దర్శకుడు క్రిష్ కెరీర్ ప్లానింగ్ మాత్రం అద్భుతంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతు ఉండటం గమనార్హం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు