విజయ్ దేవరకొండ ఆశన్ని ప్రస్తుతం కింగ్డమ్ మూవీ మీదే ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది.సితార ఎంటర్టైన్మెంట్,ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న విడుదల కాబోతోంది.ఇప్పటికే తిరుపతిలో కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 28న ఉండబోతోంది. ఇదిలా ఉంటే ఆశలన్నీ కింగ్డమ్ మూవీ పై పెట్టుకున్న విజయ్ దేవరకొండ కి సినిమా విడుదలయ్యే టైంలో భారీ షాక్ ఇచ్చింది ఆయన ప్రియురాలు రష్మిక మందన్నా.. అయితే గత కొద్దిరోజుల నుండి రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ మధ్య ఉన్న ప్రేమకు సంబంధించి లీకులు మీడియాకి ఇస్తూనే ఉన్నారు.

తాజాగా రష్మిక మందన్నా తన సోషల్ మీడియా ఖాతాలో డియర్ కామ్రేడ్ మూవీ కి సంబంధించి కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ కొన్ని సంవత్సరాల నుండి ఈ ఫోటోలు నేను మర్చిపోలేక పోతున్నాను. ఈ సినిమా విడుదలై ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ సినిమా ఇచ్చిన మెమొరీస్ అన్ని కావు. ఆ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా నేను ప్రతిసారి ఆ ఫోటోలు చూస్తూనే ఉంటాను. సంతోషాన్ని పొందుతూనే ఉంటాను. ఆ ఫోటోలు నాలో తెలియని సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ చిత్రంలో నటించిన వారందరికీ లవ్ మాత్రమే అంటూ క్యాషన్ పెట్టి విజయ్ దేవరకొండ పేరు ట్యాగ్ చేసింది.దీంతో కింగ్డమ్ రిలీజ్ వేళ విజయ్ దేవరకొండ కి రష్మిక భారీ షాక్ ఇచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. 

ఎందుకంటే ఇప్పటివరకు రష్మిక ఆఫీషియల్  గా విజయ్ దేవరకొండతో ఉన్న ప్రేమని ఎక్కడ కూడా బయట పెట్టలేదు. కానీ తాజాగా విజయ్ సినిమా విడుదలవబోతున్న వేళ ఆయనపై ఉన్న ప్రేమను ఈ విధంగా బయట పెట్టడంతో ప్రేమ వార్తలతో ఈ జంట మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది. దీంతో సినిమాకి హైప్ పెరిగే అవకాశం ఉంది. అలా సడన్గా రష్మిక విజయ్ కి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.ఇక మరో విషయం ఏంటంటే రీసెంట్గా కింగ్డమ్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుండి నేను నా తల్లిదండ్రులకి, నా గర్ల్ ఫ్రెండ్ కి కూడా సమయం ఇవ్వలేకపోతున్నాను అంటూ మాట్లాడారు. అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ రష్మికనే అని అందరికీ తెలిసిందే.అలా ఓవైపు విజయ్ దేవరకొండ మరోవైపు రష్మిక మందన్నా తమ ప్రేమ గురించి మీడియాకి లీక్స్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: