
ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకున్న హరి హర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. క్రిష్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దానికి అనుగుణంగా అల్లుకున్న కథనంలో కొత్తదనం లేదని ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్, కీరవాణి అందించిన సంగీతం సినిమాను లేపాయి. కానీ, సెకండాఫ్ లో మాస్ అండ్ ఎలివేషన్ మూమెంట్స్ డల్ అయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా దారుణంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.
టాక్ ఎలా ఉన్న నిధి అగర్వాల్ మాత్రం సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటోంది. తాజాగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నంతో కలిసి హరి హర వీరమల్లు స్క్రీనింగ్ అవుతున్న ఓ థియేటర్ లో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను నిధి సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ `సినిమా నాకు నచ్చలేదు` అంటూ కామెంట్ పెట్టగా.. నిధి అతని కామెంట్ కు రియాక్ట్ అవుతూ `పర్లేదు అండి.. అన్‌బయాస్డ్‌గా చూసే వాళ్లకి సినిమా నచ్చుతుంది` అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. దీంతో ఆమె రియాక్షన్ నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు