మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. నాలుగో సినిమాకే సొంత బ్రాండ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. అన్న‌ను మించిన క్రేజ్‌, ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఎంత ఎదిగిన అన్న ముందు మాత్రం ఒదిగే ఉండ‌టం ప‌వ‌న్ నైజాం. ఈ విషయం పక్కన పెట్టేస్తే.. పవన్ కళ్యాణ్ త‌న కెరీర్ లో వాడిన చిరంజీవి రిఫరెన్సుల్లో `పులి` టైటిల్ ఒకటి. కానీ అటు చిరంజీవి, ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రికీ ఆ టైటిల్ క‌లిసి రాలేదు.


1985లో పులి టైటిల్ తో చిరంజీవిసినిమా చేశారు. రాజ్ భారత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాధ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. రావు గోపాల్ రావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రాజేంద్ర ప్ర‌సాద్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించ‌గా.. చక్రవర్తి సంగీతం అందించారు. చిరంజీవి ఈ చిత్రంలో పోలీస్ పాత్ర పోషించారు. క‌థ బాగానే ఉంటుంది కానీ డైరెక్ష‌న్ లో తేడా కొట్ట‌డం వ‌ల్ల సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.


అయితే సుమారు పాతికేళ్ల త‌ర్వాత అంటే 2010లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ సినిమా చేశాడు. ఎస్.జె. సూర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నికీషా పటేల్ హీరోయిన్‌.  మనోజ్ బాజ్‌పేయి, శ‌ర‌ణ్య‌, చరణ్ రాజ్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల‌ను పోషించ‌గా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మొద‌ట ఈ సినిమాకు `కొమరం పులి` టైటిల్ పెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల `పులి` గా మార్చారు. ఇక ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై డిజాస్ట‌ర్ గా నిలిచింది. మొత్తంగా చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రికీ పులి టైటిల్ అనేది క‌లిసి రాలేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: