
అయితే కింగ్డమ్ సినిమా హిట్ అవ్వాలి అంటే ఎన్ని కోట్లు రాబట్టాలనే విషయంపై ఒక న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాని దాదాపుగా రూ .130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. కింగ్డమ్ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం -15 కోట్లు, సిడెడ్-6 కోట్లు, ఆంధ్ర- 15 కోట్లు, రెస్టాఫ్ ఇండియా -7.5 కోట్లు, ఓవర్సీస్-10 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మొత్తం మీద కింగ్డమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 53.5 కోట్ల రూపాయల ధియేట్రికల్ బిజినెస్ జరగగా ఈ సినిమా హిట్ గా నిలిచాలంటే రూ.55 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ ని రాబట్టాలి.
రూ.110 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని రాబడితే కింగ్డమ్ సినిమా హిట్ అయినట్టే. ఇక ఓపెనింగ్స్ కూడా బాగుండడంతో సినిమా టాకు కూడా పాజిటివ్గానే ఉండడంతో మొదటి రోజు రూ .20 నుంచి రూ.30 కోట్ల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం బ్రేక్ ఈవెన్ ఈజీగా కొడుతుందంటూ తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాయో చూడాలి మరి.