ఈ మధ్యకాలంలో సినిమాను తెరకెక్కించడం ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో సినిమాకి అదే విధంగా ప్రమోషన్స్ నిర్వహించుకోవడం కూడా ఇంపార్టెంట్ అయిపోయింది . మరీ ముఖ్యంగా బిగ్ బడా పాన్ ఇండియా స్టార్స్ కూడా బాగా ప్రమోషన్స్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది , త్వరలోనే తారక్ నటించిన సినిమా రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలుసు. అదే వార్ 2.  వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ - తారక్ పోటాపోటీగా నటించారు.  ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది .


సినిమా కోసం చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఫర్ ద ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ లో నటించాడు జూనియర్ ఎన్టీఆర్ . ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలి అంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే . కాగా బాలీవుడ్ లో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు . మరి టాలీవుడ్ కి వచ్చేసరికి సినిమా ప్రమోషన్స్ పూర్తిగా డల్ అయిపోయాయి ..? ఈ క్రమంలోనే రాజమౌళి హెల్ప్ తీసుకోవాలి అనుకుంటున్నారు మూవీ మేకర్స్ . రాజమౌళితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ని ప్లాన్ చేశారట వార్ 2 చిత్ర బృందం.



హృతిక్ రోషన్ - అయాన్ ముఖర్జీ - తారక్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారట . దీనికోసం రెండు రోజుల ఎస్ ఎస్ ఎం బి  29 మూవీ షెడ్యూల్ ని పోస్ట్ పోన్ చేసి మరి రాజమౌళి ఈ ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారట . సాధారణంగా రాజమౌళి తాను కమిట్ అయిన షెడ్యూల్ కి ఎట్టి పరిస్థితులోను బ్రేక్ చెప్పరు . కానీ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం,  గౌరవం.  ఆ కారణంగానే ఆయన కోసం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు రాజమౌళి అంటున్నారు అభిమానులు . చూడాలి మరి వార్ 2 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఏవిధంగా మెప్పిస్తాడో అభిమానుల్ని...???

మరింత సమాచారం తెలుసుకోండి: