
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంటూ అద్భుతమైన జోష్లో ముందుకు సాగిపోతున్న నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్లో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాయి. వీరు స్టార్ హీరోలతో , స్టార్ డైరెక్టర్లతో రూపొందించిన పెద్ద సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే కొత్త హీరోలతో , చిన్న దర్శకులతో రూపొందిస్తున్న చిన్న సినిమాలు కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. తాజాగా ఈ బ్యానర్ వారు విజయ్ దేవరకొండ హీరో గా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ సినిమాను రూపొందించారు. ఈ మూవీ ఈ రోజు విడుదల అయ్యి పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. ఇలా ఈ బ్యానర్లో రూపొందిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధిస్తూ వెళ్లడంతో మాస్ జాతర సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.