తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. వెంకటేష్ ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అలా వదులుకున్న సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని కూడా అందుకున్నాయి. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకు ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇది ఇలా ఉంటే వెంకటేష్ , శంకర్ కాంబోలో రెండు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలు ఏవి ..? ఎందుకు మిస్ అయ్యాయి ..? అనే వివరాలను తెలుసుకుందాం.

దర్శకుడు శంకర్ కొన్ని సంవత్సరాల క్రితం కమల్ హాసన్ హీరో గా భారతీయుడు అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో కమల్ హాసన్ తండ్రి , కొడుకు పాత్రలలో నటించాడు. దర్శకుడు శంకర్ మొదట ఈ సినిమాలో తండ్రి పాత్రలో టాలీవుడ్ హీరో రాజశేఖర్  ను , కొడుకు పాత్రలో విక్టరీ వెంకటేష్ ను అనుకున్నాడట. కానీ ఆ తర్వాత అది కుదరకపోవడంతో కమల్ హాసన్ ను ఈ మూవీలో హీరోగా ఎంచుకొని రెండు పాత్రలను కూడా ఆయనతోనే చేయించాడట. దర్శకుడు శంకర్ కొన్ని సంవత్సరాల క్రితం అర్జున్ హీరో గా ఒకే ఒక్కడు అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని కూడా మొదట శంకర్ , వెంకటేష్ తో చేయాలి అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదట. అలా వెంకటేష్ తో రెండు సార్లు శంకర్ సినిమా చేద్దాము అనుకున్న కూడా అది కొన్ని కారణాల వల్ల కుదరలేదట. ఈ వార్త బయటకు రావడంతో చాలా మంది వెంకటేష్ గనుక ఆ రెండు సినిమాల్లో హీరో గా నటించి ఉండి ఉంటే ఆయనకు ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ వచ్చేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా వెంకటేష్ ప్రస్తుతం కూడా సూపర్ సాలిడ్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: