
టాలీవుడ్‌లో ఈ తరం స్టార్ హీరోయిన్లలో చాలామంది నిజంగా లక్కీ. టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోయిన్‌లకు సీనియర్ హీరోలతో పాటు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఒకవైపు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ స్టార్స్‌తో నటించడంతో పాటు, మరోవైపు ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి యంగ్ స్టార్‌లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి హీరోయిన్లలో శృతి హాసన్ ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కమల్ హాసన్ కూతురిగా సినీ ప్రపంచంలో అడుగుపెట్టి, తన సొంత శైలిలో పేరు సంపాదించుకున్న శృతి హాసన్, తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆమె నటించిన చాలా సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఆమె కెరీర్‌లో కొన్ని ప్లాపులు కూడా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ – శృతి హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా అదే ఉదాహరణ.
ఈ సినిమాలో శృతి హాసన్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్, మేకోవర్, బాడీ లాంగ్వేజ్ ఆమె పాత్రకు సరిపోలలేదన్న విమర్శలు అప్పట్లో జోరుగా వినిపించాయి. పల్లెటూరి ముద్దుగుమ్మగా కనిపించాల్సిన ఆమె, గ్లామర్ లుక్‌లో ఎక్కువగా కనిపించడంతో ప్రేక్షకులకు నచ్చలేదు. శృతి హాసన్, నందమూరి బాలకృష్ణ సరసన నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్‌ను అందించారు. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో శృతి పాత్రకు మంచి స్కోప్ ఉండటంతో పాటు, బాలయ్యతో ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా నందమూరి హీరోలలో శృతి బాలయ్యకు సూపర్ హిట్ ఇచ్చి... ఎన్టీఆర్‌కు మాత్రం ప్లాప్ సినిమా ఇచ్చింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు