
సినిమా కమిట్ చేసిన తర్వాత షెడ్యూల్ విషయంలో ఆటలు ఆడుతుందని, అందుకే గతంలో కూడా ఆమె చేయాల్సిన కొన్ని సినిమాలను వేరే హీరోయిన్స్‌తో పూర్తి చేశారని టాక్. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే, శృతి తెలుగు సినిమాల నుంచి దూరం పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభాస్‌తో చేసిన సలార్ రెండో భాగంలో నటించాల్సి ఉంది కాబట్టి అది మాత్రం తప్పనిసరిగా చేస్తుంది. కానీ ఆ తర్వాత తన పూర్తి దృష్టి కోలీవుడ్ ప్రాజెక్టులపైనే పెట్టాలని చూస్తోందట. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన గబ్బర్ సింగ్ తో టాలీవుడ్‌లో తన మొదటి బ్లాక్‌బస్టర్ అందుకున్న శృతి, ఆ తర్వాత వరుసగా మంచి ప్రాజెక్టులు చేసుకుంది. అయితే కాలక్రమేణా, ఆమె ఎంపికలు, ప్రొఫెషనల్ అప్రోచ్‌పై వచ్చిన విమర్శలు తెలుగు మార్కెట్‌లో అవకాశాలను తగ్గించాయి.
ప్రస్తుతం శృతి హాసన్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి నటించిన కూలీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. రజినీ-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పాన్-ఇండియా స్థాయిలో హైప్ సృష్టించడంతో, శృతికి మళ్లీ కొత్త క్రేజ్ వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి, శృతి హాసన్ టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోతున్నా, కోలీవుడ్‌లో మాత్రం తన కెరీర్‌ను మళ్లీ పీక్‌కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. కూలీ విజయం ఆమెకు కొత్త జోష్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ టాలీవుడ్‌లో ఆమె మళ్లీ ఫుల్‌టైమ్ రీ-ఎంట్రీ ఇస్తుందా? లేక ఈ గుడ్‌బై పర్మనెంట్ అవుతుందా? అనేది కాలమే చెప్పాలి.