
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరో గా రూపొందిన గిల్లి సినిమాను కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా 32.50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక తలపతి విజయ్ హీరోగా రూపొందిన సచిన్ మూవీ ని కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేయగా ఈ మూవీ 13.60 కోట్ల కలక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో కొనసాగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఖలేజా సినిమాను కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేయగా ఈ సినిమా 10.78 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో కొనసాగుతుంది. మహేష్ బాబు హీరో గా రూపొందిన మురారి సినిమా 8.90 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా 8.01 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో కొనసాగుతుంది. ఇలా ఈ సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా అత్యధిక అత్యధిక వసూలు చేసిన టాప్ 5 మూవీ ల లిస్టులో చోటు దక్కించుకున్నాయి.