
ఇదిలా ఉంటే, ఒకవేళ నిజంగానే ‘మాస్ జాతర’ ఆగస్ట్ 27నుంచి తప్పుకుంటే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం పరిస్థితి బిగుసుకుపోతుంది. ఎందుకంటే సెప్టెంబర్ నెల ఇప్పటికే బోలెడంత సినిమాలతో హౌస్ ఫుల్. మొదటి వారంలో ఘాటీ, మిరాయ్, మదరాసి వస్తుండగా, రెండో వారంలో కిష్కిందపురి, భద్రకాళి బరిలోకి దిగుతున్నాయి. అంతేకాదు సెప్టెంబర్ 25న అఖండ 2 – ఓజి భారీ స్థాయిలో క్లాష్ అవుతున్నాయి. వీటిలో ఒకటి తప్పుకుంటుందనే మాటలున్నా, ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. దాంతో ‘మాస్ జాతర’ కి మధ్యలో ఖాళీ డేట్ దొరకడం కష్టమేనని అనిపిస్తోంది. అక్టోబర్ 2న కాంతార, ఇడ్లి కడాయి వంటి క్రేజీ ప్రాజెక్టులు క్యూ కట్టి ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
అందులోనూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ఇది వరుసగా రెండో షాక్. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన కింగ్డమ్ ఫెయిల్యూర్ అవ్వడం, మరోవైపు పెద్ద మొత్తంలో హక్కులు కొన్న వార్ 2 తెలుగులో బలహీన వసూళ్లు సాధించడం కలిసొచ్చి, బాక్సాఫీస్ వాతావరణం ప్రతికూలంగా మారింది. ఈ లోపులో ‘మాస్ జాతర’ ఫైనల్ కాపీ సిద్ధం కాకుండా రిలీజ్ ఒత్తిడి తీసుకోవడం మరింత రిస్క్ అవుతుందని భావిస్తున్నారు. మొత్తానికి, అభిమానులు ఒక్క ప్రశ్నే అడుగుతున్నారు –“మాస్ జాతర సెప్టెంబర్ లో ఎక్కడైనా దూరుతుందా? లేక అక్టోబర్–నవంబర్ లకే వాయిదా పడుతుందా?”