సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో ఫహద్ ఫాజిల్ ఒకరు కాగా పుష్ప, పుష్ప2 సినిమాలతో ఫహద్ ఫాజిల్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది. అయితే ఫహద్ ఫాజిల్ మారీషన్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ డైరెక్టర్ అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిటు సినిమాలో ఛాన్స్ వచ్చినా వదులుకున్నానని ఫహద్ ఫాజిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ది రివెనెంట్,  బర్డ్ మ్యాన్ సినిమాల దర్శకుడు ఇనారిటు  తన ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదించారని అయితే ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చారు.  అంటే దానర్థం  ఆయన నన్ను రిజెక్ట్ చేసినట్లు కాదని ఇంగ్లిష్ లో చెప్పే విధానమే అందుకు కారణమని వెల్లడించారు.  ఆయన అనుకున్న విధంగా భాషపై నాకు పట్టు రావాలంటే అమెరికాలో మూడు నుంచి నాలుగు నెలలు ఉండాలని ఫహద్ ఫాజిల్ తెలిపారు.

ఇదే విషయాన్నీ నేను వాళ్లకు చెప్పానని కానీ అందుకు వాళ్ళు ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని  అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే   ఎగురుకుంటూ వెళ్ళేవాడినని  ఆయన అన్నారు. వాళ్ళు ఆసక్తి చూపకపోవడంతో నేను  దాని గురించి అంతగా పట్టించుకోలేమని ఆయన చెప్పుకొచ్చారు.  మరో విషయం ఏంటంటే కమర్షియల్ కోణం నుంచి చూస్తే  ఆ రోల్ కు నేను సరిపోనని ఆయన తెలిపారు.

ఆ ఛాన్స్ కోల్పోయినందుకు నేను ఎంతమాత్రం బాధ పడలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ దర్శకుడు నాతో  వీడియో కాల్ మాట్లాడారని  ఆ సమయంలో  నా ఆంగ్ల పరిజ్ఞానం చూసి ఇనారిటు ఒక నిరయానికి వచ్చారని అనిపించినందని ఆయన తెలిపారు.  ఇలాంటి చర్చలు చాలా సినిమాలకు జరిగాయని అవకాశాలు కోల్పోయిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఫహద్ ఫాజిల్ చెప్పిన విషయాలు  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: