- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా “విశ్వంభర” అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్. అయితే ఈ సినిమాను మొదట 2024 చివర్లో లేదా 2025 ఆరంభంలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తాజా అప్‌డేట్ ప్రకారం సినిమా రిలీజ్ డేట్‌ను ఏకంగా 2026 సమ్మర్‌కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి వీడియో ద్వారా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ వాయిదా వెనక అసలు కారణం ఏమిటి ? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చిరంజీవి క్లారిటీ ఇస్తూ, సినిమా రెండో భాగం మొత్తం గ్రాఫిక్స్‌పైనే ఆధారపడి ఉందని చెప్పారు. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, అత్యున్నత ప్రమాణాలతో విజువల్స్ అందించాలనే దర్శక - నిర్మాతల పట్టుదల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. సాధారణంగా ఇలాంటి హై విజువల్ వండర్ మూవీస్‌కి అవసరమైన సమయం చాలా ఎక్కువ అవుతుంది.


ఆలస్యమైనా క్వాలిటీని కాంప్రమైజ్ చేయకుండా ముందుకు వెళ్తున్నామ‌ని మెగాస్టార్ వివరించారు. “విశ్వంభర” ఒక పౌరాణిక ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతోంది. కథలో చందమామ, లోకాలు, మాంత్రికత, అద్భుత ప్రపంచం వంటి విభిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇది కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా కుటుంబమంతా కలిసి చూడగలిగే ఫాంటసీ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంద‌ట‌. చిరంజీవి మాట్లాడుతూ “ఈ సినిమా చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్లను కూడా అలరిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఫాంటసీ జర్నీ అవుతుంది. 2026 వేసవిలో మీ ముందుకు వస్తుంది. సమ్మర్ సీజన్‌లో పిల్లలు స్కూల్స్‌కి సెలవులు ఉండటంతో అంద‌రూ క‌లిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంద‌ని చెప్పారు. ఈ లోగా చిరు - అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వ‌చ్చేస్తుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: