
ఇదే సమయంలో చిరంజీవికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన లక్కీ నెంబర్ ఏంటి అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చాలామంది చిరంజీవి లక్కీ నెంబర్ “2” అంటూ చెబుతున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ మొత్తానికి “2” నెంబర్ బాగా కలిసొస్తుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. చిరంజీవి పుట్టింది ఆగస్టు 22వ తేదీన. అందుకే “2” ఆయనకు చాలా లక్కీ నెంబర్ అని చెబుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. అందువల్ల ఆ తేదీ కూడా మెగాఫ్యాన్స్ అది లక్కీ నెంబర్‌గా భావిస్తున్నారు. ఇక మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు క్లిం కారా జూన్ 20న జన్మించింది — ఇందులో కూడా “2” వస్తుంది. రామ్ చరణ్ పుట్టింది మార్చి 27, అందులో కూడా ముందు “2” వస్తుంది.
ఈ కారణంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ — ముగ్గురికీ “2” నెంబర్ ఒక కామన్ లక్కీ నెంబర్‌గా అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి తర్వాత ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడో పవన్ కళ్యాణ్, ఆయన తర్వాత రామ్ చరణ్, ఇక రామ్ చరణ్ తర్వాత తన కూతురు కూడా అలాంటి పేరు సంపాదిస్తుంది అన్న లాజిక్‌తో సోషల్ మీడియాలో అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. నేడు చిరంజీవి బర్త డే సంధర్భంగా ఆయనకి సంబంధించిన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు..!!