
అయితే ఇదే సమయంలో టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగారు. ఇప్పటికే 16 రోజులు పూర్తయ్యాయి కానీ ఇంకా చర్చలు ముగియలేదు. దీంతో అల్లు అర్జున్–అట్లీ మూవీ టీంకు భారీ షాక్ తగిలింది. ఈ మూవీ షూటింగ్‌కి టాలీవుడ్ నుంచి ముందే మాటిచ్చిన వారు ఎవరూ వెళ్లడం లేదని సమాచారం. దాంతో గత ఆరు రోజులుగా షూటింగ్ పూర్తిగా ఆగిపోయిందట. రోజుకు దాదాపు కోటి రూపాయల చొప్పున మొత్తం తొమ్మిది కోట్ల వరకు నష్టం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సమ్మె త్వరలో ముగుస్తుందని ప్రచారం జరుగుతున్నా ఇంకా దానిపై స్పష్టత రాలేదు. సమ్మె ముగిసిన వెంటనే రెగ్యులర్‌గా షూటింగ్ ప్రారంభమైతేనే ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చు. అల్లు అర్జున్ ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే ఉండి, షూటింగ్ ఆగిపోవడంతో కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడని అంటున్నారు.
ఇక ఈ సినిమాకి భారీ బడ్జెట్ కేటాయించిన మేకర్స్‌కు ముందుగానే బొక్క పడింది అంటూ ట్రోల్లింగ్ ప్రారంభమైంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే "పుష్ప" ప్రీమియర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన సంఘటనను గుర్తు చేసుకుంటూ .. ఆ పాపమే బన్నీకి శాపంలా వెంటాడుతోంది అని ట్రోల్ చేస్తున్నారు. దానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఘాటుగానే కౌంటర్ వేస్తున్నారు.