
అది కూడా టాలీవుడ్ లో ఒక బడా ఫ్యామిలీ గా పేరు పొందిన ఘట్టమనేని వారసుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రంలో రాషా తడాని హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా లవ్ స్టోరీ నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు అయితే వేగంగా జరుగుతున్నాయట. ఈ చిత్రానికి సంబంధించి కథను కూడా రాషా తడాని రవీనా టాండన్ విని ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించి అక్టోబర్ 15 నుంచి సినిమా షూటింగ్ పనులు మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.రాషా తడాని ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం .మరియు ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఈ ముద్దుగుమ్మ చాలానే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందుకు సంబంధించి అధికారికంగా చిత్ర బృందం ఏదైనా క్లారిటీ ఇస్తే బాగుంటుందని అటు ఘట్టమనేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లో మరేన్ని చిత్రాలు నటిస్తుందో చూడాలి.