సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటేనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గుర్తింపు ఉన్నటువంటి ఫ్యామిలీ.. నందమూరి ఫ్యామిలీకి ఇంతటి పేరు ప్రఖ్యాతలు రావడానికి ప్రధాన కారణం సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. ఆయన తన సినిమాలతో రాజకీయాలతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నందమూరి ఫ్యామిలీ తెలిసేలా చేశారు.అయితే అలాంటి నందమూరి ఫ్యామిలీ లో ఎంతోమంది సినిమాల్లోకి వచ్చారు. ముఖ్యంగా నందమూరి తారక రామారావు పేరుని అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో రెండు రంగాల్లో నిలబెడుతున్నారు నందమూరి బాలకృష్ణ.. నందమూరి బాలకృష్ణ పలు సినిమాలు చేస్తూనే తండ్రి లాగా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే హిందూపురంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.

అయితే అలాంటి నందమూరి బాలకృష్ణ గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అదేంటంటే..బాలకృష్ణ ఇప్పటివరకు దేశ సినీ చరిత్రలో ఎవరు అందుకొని ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారట. మరి ఇంతకీ బాలకృష్ణ అందుకున్న ఆ అరుదైన గౌరవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన 50 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్ గా జరిగిన సంగతి మనకు తెలిసిందే.అయితే సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లుగా అభిమానులను అలరించడమే కాదు దాదాపు 15 సంవత్సరాల నుండి తన తల్లి పేరు మీద పెట్టిన బసవతారకం ఆసుపత్రి ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

అయితే ఈయన హాస్పిటల్ పేరు మీద చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి యూకే లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గోల్డ్ ఎడిషన్ గుర్తింపును ఇచ్చింది. అయితే ఇప్పటివరకు మన దేశ సినీ చరిత్రలో ఇలాంటి గౌరవాన్ని ఏ ఒక్క హీరో కూడా అందుకోలేదు.కానీ మొట్టమొదటిసారి బాలకృష్ణ ఈ అరుదైన గౌరవాన్ని అందుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు బాలకృష్ణకి ఈ అరుదైన గౌరవం వచ్చినందుకు గానూ ఆగస్టు 30వ తేదీన హైదరాబాదులో జరిగే కార్యక్రమాల్లో బాలయ్య బాబుని సత్కరించబోతున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం బయటపడడంతో చాలామంది నందమూరి అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ బాలకృష్ణని తెగ పొగడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: