ఒక అమ్మాయి కనిపిస్తే చాలు… ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, పిచ్చి పిచ్చి మాటలతో పైశాచిక ఆనందాన్ని పొందడం అనేది కొంతమంది అబ్బాయిల స్వభావంగా మారిపోయింది. అందరూ అలా చేస్తారు అని కాదు కానీ, చేతికి దురద – నోటికి దూల ఉన్న కొంతమంది మాత్రం ఎక్కడ ఆడవాళ్లను చూసినా తమ అసలు స్వరూపాన్ని బయటపెడుతుంటారు. రోడ్డుపై నడుస్తున్న అమ్మాయి అయినా, ట్రైన్ ఎక్కిన అమ్మాయి అయినా, బస్సులో కూర్చున్న అమ్మాయి అయినా, ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వీళ్లకు ఒక రకంగా అలవాటైపోయింది. ఇలాంటి వారిలో సాధారణ ప్రజలే కాదు, స్టార్ సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్లు బయటకు బాగా కనిపిస్తారు కానీ, లోపల మాత్రం వేరే స్వరూపం చూపిస్తారు. తాజాగా అలాంటి ఘటన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోపై వెలుగులోకి వచ్చింది.


ఇతగాడు ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరో. వరుస హిట్స్ కొట్టాడు, మంచి మంచి సినిమాలు చేశాడు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం పెద్దగా క్లిక్ కాలేకపోయాడు. కెరీర్ లో డౌన్ ఫేజ్ ఎదుర్కొంటున్నప్పటికీ, తన పేరు మాత్రం ఇప్పటికీ పాపులర్‌గానే ఉంది. ఇలాంటి సమయంలో సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ గ్రూపులో కమెడియన్స్, కొంతమంది సెలబ్రిటీల పిల్లలు, హీరోయిన్‌లు, బాలీవుడ్ బ్యూటీస్ కూడా ఉన్నారట. ఆ గ్రూపులో చేరిన ఒక యంగ్ హీరోయిన్ మొదట్లో అందరితో పద్ధతిగా మాట్లాడేది. చిన్న సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమెకు ఆ సినిమా హిట్ కావడంతో పెద్ద సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి. అయితే ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఆమె కెరీర్ అంతగా జోరుగా సాగలేదు. ఒక సీనియర్ హీరోతో చేసిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.



అలాంటి టైంలో ఈ వాట్సాప్ గ్రూపులో చేరిన ఆమె మొదట్లో అందరితో నార్మల్ ఫ్రెండ్లీగా ఉండేది. కానీ క్రమంగా కొంతమంది ఆ గ్రూపులో లిమిట్స్ దాటి ఫన్నీగా, అసభ్యంగా కామెంట్స్ చేయడం మొదలెట్టారు. ఈ హీరోయిన్ మొదట్లో వాటిని పట్టించుకోకుండా లైట్‌గా తీసుకుంది. అయితే ఒకరోజు ఆ స్టార్ హీరో మాత్రం తన హద్దులు దాటి, నేరుగా ఆమె పేరునే ట్యాగ్ చేస్తూ బూతు పదం వచ్చేలా ఒక అసభ్యకరమైన మెసేజ్ చేశాడట. ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయిందట. ఇంత పెద్ద స్టార్ హీరో తన గురించి ఇలాంటి అసభ్యకరమైన మెసేజ్ పెట్టడాన్ని చూసి తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. వెంటనే ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసింది. అంతేకాదు ఈ విషయం ఆ గ్రూపులో ఉన్న మరో కొందరు హీరోయిన్స్‌కు కూడా చెప్పి కన్నీళ్లు పెట్టుకుందట.



ఈ వ్యవహారం బయటకు రాగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది. ఈ వార్త బాగా హాట్ టాపిక్ అయ్యింది. ఒక స్టార్ హీరో ఇంత తక్కువ స్థాయిలో ప్రవర్తించడం చూసి చాలామంది అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మళ్లీ ఒకసారి ఇండస్ట్రీలోని కొంతమంది స్టార్‌ల అసలు స్వరూపం బయటపడింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: