
అయితే పవన్ కోసం నిధి చేసిన ఈ తప్పే ఇప్పుడు ప్రభాస్ కోసం మాళవిక మోహనన్ చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నిధి రేంజ్ లో మాళవిక అగ్రిమెంట్ పై సైన్ చేసిందో లేదో తెలియదు కానీ.. `ది రాజా సాబ్` విడుదల అయ్యేంతవరకు మరో తెలుగు సినిమాకు ఆమె సంతకం చేసేలా కనిపించడం లేదు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ తన కెరీర్‌లో చేస్తున్న తొలి హారర్ మూవీ ఇది. ఈ చిత్రంలో మాళవిక మెయిన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది.
నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా నటిస్తున్నారు. చాలా నెలల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. కానీ ఇంకా చిత్రీకరణ ఫినిష్ కాలేదు. డిసెంబర్ 5న రాజా సాబ్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఇప్పుడు ఆ తేదీకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతికి అయినా వస్తుందా అంటే అదీ డౌట్ గానే చెబుతున్నారు. మాళవిక తలుచుకుంటే ఈ గ్యాప్ లో మరో రెండు చిత్రాలు చేసేయవచ్చు. అయితే ఆమె మాత్రం రాజాసాబ్ విడుదల వరకు మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. మరి ప్రభాస్ మూవీతో మాళవిక బిగ్ హిట్ అందుకుంటుందా? లేక నిధి మాదిరిగానే ఎదురుదెబ్బ తింటుందా? అన్నది చూడాలి.