ఇండస్ట్రీలో హీరోగా అయినా, హీరోయిన్గా సెటిల్ అవ్వాలి అనుకున్నా అది మామూలు విషయం కాదు. ఎంత తండ్రి పేరు, తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా, ఒక టాలెంట్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీలో స్టార్స్‌గా ఎదగగలరు. లేకపోతే ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా ఒకటి రెండు సినిమాలు మాత్రమే నెట్టుకురాగలరు, ఆ తర్వాత డౌన్ ఫాల్ అయిపోతారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆయన తాజాగా నటించిన వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద డమాల్ అంటూ పడిపోయింది. కలెక్షన్స్ పరంగా కూడా పెద్ద హైప్ క్రియేట్ చేయలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఒక బ్యాచ్ దారుణంగా ట్రోల్ చేసింది.


అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం సినిమా అవకాశాల పరంగా ఎక్కడా తగ్గడం లేదు. చాలామంది స్టార్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా, జూనియర్ ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయ్యాక, కొరటాల శివ ..దేవర 2, ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఒక ప్రాజెక్ట్, ఆ తర్వాత లోకేష్ కనగరాజ్‌తో బిగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. అంటే తన నెక్స్ట్ లైన్‌అప్ అంతా క్రేజీ డైరెక్టర్స్‌దే. జూనియర్ ఎన్టీఆర్‌కు ఇంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం ఏమిటి అంటే..అయన సెలెక్ట్ చేసుకునే కథలు, ఆయన నటన, ముఖ్యంగా ఆయన కమిట్‌మెంట్ అని అభిమానులు అంటున్నారు.



ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో–హీరోయిన్ పర్ఫార్మెన్స్, డైరెక్టర్ డైరెక్షన్ మాత్రమే కాదు, సినిమా అనుకున్న టైంలో సక్సెస్‌ఫుల్‌గా పూర్తవ్వాలి. అది ఒక్కరి వల్ల కాదు, అందరూ సమయాన్ని పాటించాలి. ఆ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ ముందుంటారు. ఆయన ఏ సినిమా షెడ్యూల్ ఏ టైం కి చెప్పినా, ఆ టైమ్ కంటే ముందే సెట్‌కి చేరుకుంటారు. షూట్ స్మూత్‌గా పూర్తయ్యేలా చూసుకుంటారు. ఇప్పటివరకు ఆయన నటించిన ప్రతీ సినిమా షెడ్యూల్ టైం టు టైమ్‌కి ఫాలో అయ్యిందని మూవీ మేకర్స్ కూడా చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు టైమ్ విలువ బాగా తెలుసు. ఆయన టైంకి సెట్స్‌కి రాగలరనే నమ్మకం కారణంగానే, కమిట్ అయిన సినిమాలు త్వరగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చాలామంది మూవీ మేకర్స్ అంటున్నారు. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ ఏ విషయంలోనైనా ఆలోచించి పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తారు. అందుకే ఆయన ప్రతీ విషయంలో సక్సెస్ సాధిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా అనుకుంటే, ఆ పని పూర్తయ్యే వరకు ఆగరు. ఆ క్వాలిటీ కారణంగానే ఇండస్ట్రీలో ఇంత పెద్ద స్టార్‌గా ఎదిగారని సినీ ప్రముఖులు, మూవీ మేకర్స్ చెబుతున్నారు. నిజమే, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద స్టార్ అవగలిగాడు. ఇదే విషయం ఫ్యాన్స్ కూడా గర్వంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: