
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ సొంత ఇల్లు మన్నత్ ముంబై బాంద్రాలో పర్యాటకులను కూడా ఆకర్షించే స్పాట్. ఈ భవంతి విలువ దాదాపు రూ. 200 కోట్లు. ఆరు అంతస్తుల విలాసవంతమైన ఈ గృహంలో రాజభవనాన్ని తలపించే ఇంటీరియర్స్ ఉన్నాయి. ఇప్పుడు మరికొన్ని ఎకరాలు కలుపుతూ మరో రూ. 200 కోట్ల పెట్టుబడి పెడుతున్నారని టాక్. అలా అయితే ఈ బంగ్లా విలువ 400 కోట్లు దాటనుంది. బాలీవుడ్ షహెన్‌షా అమితాబ్ బచ్చన్ నివాసం జల్సా. జుహూలో ఉన్న ఈ రెండు అంతస్తుల భవంతి విలువ రూ. 120 కోట్లు. అభిమానులను కలిసే వేదికగానే ఈ ఇల్లు నిలుస్తుంది. విలాసవంతమైన ఫర్నిచర్, స్విమ్మింగ్ పూల్‌తో ఈ ఇంటి ప్రత్యేకత మరింత పెరిగింది. రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే ఈ స్టార్ జంట బ్యూమాండే టవర్స్ లో రూ. 119 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. సముద్రాన్ని ఎదురుగా చూసే అద్భుత దృశ్యం ఈ ఇంటి హైలైట్. డిజైనర్ ఇంటీరియర్స్‌తో ఈ హౌస్ ఒక ఆర్ట్ గ్యాలరీలా ఉంటుంది. శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా జుహూలోని కినారా బంగ్లా ఈ జంటకు చెందినది. విలువ రూ. 100 కోట్లు. లగ్జరీ ఇంటీరియర్స్, వింటేజ్ ఆర్ట్ వర్క్ ఈ ఇంటిని రిసార్ట్‌లా మార్చేశాయి.
సల్మాన్ ఖాన్ – గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ .. భారీ బంగ్లాలు ఉన్నా, సల్మాన్ మాత్రం తనకు సెంటిమెంట్‌గా ఉన్న గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ లోనే ఉంటున్నాడు. విలువ రూ. 100 కోట్లు. అభిమానులు ఎప్పటికప్పుడు ఈ అపార్ట్‌మెంట్ వద్దే గుమిగూడుతుంటారు. బాలీవుడ్ స్టార్లకి ఏమాత్రం తగ్గకుండా టాలీవుడ్ హీరోలు కూడా లగ్జరీ హౌస్‌లలో మునిగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి: కేవలం స్వయంకృషితో నిర్మించుకున్న విలాస భవంతి ఎప్పటికప్పుడు చర్చలో ఉంటుంది. అక్కినేని నాగార్జున: టాలీవుడ్‌లో అత్యంత ధనిక హీరోగా నిలిచిన నాగ్, తన విలాసభవనంతో రికార్డులు సృష్టించాడు. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్ లాంటి ప్రముఖులు కూడా వందల కోట్ల విలువ చేసే గృహాల్లో నివసిస్తున్నారు.