
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒకటి కాదు, ఏకంగా మూడు వేరువేరు షేడ్స్‌లో కనిపించనున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో ఐదు మంది టాప్ హీరోయిన్‌లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని, వీరి ప్రతి పాత్ర కూడా స్పెషల్‌గా ఉండబోతుందన్న వార్త అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇంకా అంతటితో ఆగకుండా, టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి ఏకంగా పది మంది సూపర్‌స్టార్స్ ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ పోషించనున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కాంబినేషన్ వల్ల సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఇదే సమయంలో, ఈ సినిమాలో కన్నడ బ్యూటీ, గుప్పెడంత సీరియల్ ఫేమ్ జగతి అలియాస్ జ్యోతిరాజ్ ఓ స్పెషల్ పాత్రలో నటించబోతున్నారని వచ్చిన వార్త పెద్ద చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుండటమే కాకుండా, నెట్టింట పెద్ద కాంట్రవర్సీ కూడా మొదలైంది. జ్యోతిరాజ్ గతంలో కొన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్స్, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు అట్లీ ఈ పాత్ర కోసం ఆమెను ఎందుకు ఎంచుకున్నాడని..? ఈ నిర్ణయం అవసరమా అని..? అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
"ఈ సినిమాకి అలాంటి కాంట్రవర్షియల్ ఇమేజ్ ఉన్న హీరోయిన్‌ను ఎందుకు తీసుకున్నారు?" అంటూ బన్నీ అభిమానులు ట్వీట్స్, పోస్టుల రూపంలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మీద నెట్టింట పెద్ద చర్చ నడుస్తుండటమే కాకుండా, సినిమా మీద హైప్ మరింత పెరిగిపోయింది. మొత్తానికి, అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా ప్రతి చిన్న అప్డేట్‌కే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.