ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటి మణులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో రష్మిక మందన ఒకరు. ఈమె కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా అయినటువంటి ఛలో తోనే ఈమెకు అద్భుతమైన విజయం దక్కింది. ఆ తర్వాత ఈమె నటించిన గీత గోవిందం సినిమా కూడా సూపర్ సాలిడ్ విజయం సాధించడంతో ఈమె క్రేజ్ ఒక్క సారిగా తెలుగు సినీ పరిశ్రమలో భారీగా పెరిగింది. ఆ తర్వాత ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో అత్యంత తక్కువ కాలం లోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఈమె కొంత కాలం క్రితం తెలుగు సినిమా అయినటువంటి పుష్ప పార్ట్ 1 మరియు పుష్ప పార్ట్ 2 మూవీలలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లు మంచి విజయాలు సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఈమె తెలుగు తో పాటు తమిళ్ , హిందీ సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ప్రస్తుతం కాంచన 4 అనే సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా ఈ మూవీ లో రష్మిక మందన కూడా నటించబోతున్నట్లు ఈమె రెండవ హీరోయిన్గా కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే రష్మిక మందన ఈ సినిమాలో నటించడం కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఈ మూవీ లో ఈమె సెకండ్ హీరోయిన్ పాత్రలో కాకుండా ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో దయ్యం పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు రష్మిక తన కెరియర్లో దయ్యం పాత్రలో నటించలేదు. రష్మిక తన  కెరియర్లో మొట్ట మొదటి సారి ఈమె కాంచన 4 మూవీ లో దయ్యం పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజం అయితే దయ్యం పాత్రలో రష్మిక ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm